Etela comments on CM KCR : తెలంగాణలో రైతుల వడ్లు కొనలేని పరిస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీలు లేవన్న కేసీఆర్ నేడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటున్నారని మండిపడ్డారు.
అందితే జుట్టు అందకపోతే కాళ్లు.. కేసీఆర్ వైఖరి అదే : ఈటల - ఎమ్మెల్యే ఈటల రాజేందర్ న్యూస్
Etela comments on CM KCR : కమ్యూనిస్టు పార్టీలే లేవన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానిని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారని.. ప్రధాని పర్యటనలో భద్రత కల్పించాల్సిన పూర్తి బాధ్యత పోలీసులదే అని స్పష్టం చేశారు.
Etela comments on CM KCR
ప్రధానిని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారు. ప్రధాని పర్యటనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. మోదీ పర్యటనలో ఎవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ ఇవాళ, రేపు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
Last Updated : Nov 11, 2022, 2:17 PM IST