తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేదిలేదు' - ETELA RAJENDER FIRES ON CM KCR

ETELA RAJENDER FIRES ON CM KCR: తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బెదిరింపులు వచ్చినా భయపడలేదని గుర్తు చేశారు. సభలో ఎవరిది తప్పో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేదిలేదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

By

Published : Sep 14, 2022, 3:27 PM IST

Updated : Sep 14, 2022, 4:53 PM IST

ETELA RAJENDER FIRES ON CM KCR: తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బెదిరింపులు వచ్చినా భయపడలేదని గుర్తు చేశారు. చావుకు భయపడేది లేదని పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగితే యావత్‌ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తామన్నారు. కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేదిలేదని హెచ్చరించారు. సభలో ఎవరిది తప్పో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు, సభ్యుల హక్కులను సభాపతి కాపాడాలని ఈటల రాజేందర్ సూచించారు.

శాసనసభాపతిని మరమనిషి అంటే కేసీఆర్‌కు ఇంత కోపం ఎందుకని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాను రాజీనామా ఇస్తానని అనప్పుడు కనీసం కలిసే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. తమకు గది కేటాయించకుండా సభాపతి అవమానించారని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా గతంలో ఎప్పుడూ సభ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. భాజపా సభ్యుల హక్కులను సభాపతి కాలరాశారని విమర్శించారు. బీఏసీ సమావేశానికి తమ పార్టీ సభ్యులను పిలవలేదని తెలిపారు.

బీఏసీ గురించి రఘునందన్‌రావు అడిగినా సభాపతి పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలు గురించి సభలో ఎవరూ మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. బీఏసీలో సీఎం ఇచ్చిన అజెండానే సభలో అమలుచేశారని విమర్శించారు. శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని తాను కోరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో సమస్యలపై ప్రస్తావించకుండా కాంగ్రెస్‌, మజ్లీస్‌ కేసీఆర్‌ చెప్పినట్లు నడుచుకుంటున్నాయని దుయ్యబట్టారు. గొల్లకురుమలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాత బస్సులతో ఆర్టీసీ నత్తనడక నడుస్తోందని ఈటల రాజేెందర్ పేర్కొన్నారు.

'కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేదిలేదు'

"స్పీకర్ మరమనిషి లాగా పనిచేస్తున్నారని అన్నాము. మరమనిషి అని ఎవరని అంటారు తన స్వంత ఆలోచనలతో పని లేకుండా ఇతరులు చెబితే పనిచేసే వారినే ఇలా అంటారు. బీఏసీ సమావేశానికి మమల్ని పిలవలేదు. మాకు గది కేటాయించిన అడిగినా పట్టించుకోలేదు. ఎక్కడ కూడా బీఏసీలో సమస్యల ప్రస్తావన లేకుండా సీఎం ఏది చెప్పారో వాటికే కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పుకున్నారు. తెలంగాణ భాషను, సంస్కృతిని కేసీఆర్ అవమానపరుస్తున్నారు." - ఈటల రాజేందర్ భాజపా ఎమ్మెల్యే

అసలేం జరిగిదంటే: నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో తనను బలవంతంగా తీసుకెళ్లడంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండై సభ నుంచి బయటకు వెళ్లిన ఈటల తొలుత మీడియా పాయింట్‌కు వెళ్లేందుకు యత్నించారు. కానీ అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో... ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సొంత వాహనం కోసం వేచి చూస్తుండగా.. ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుంచి తరలించారు.

ఇవీ చదవండి:కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను: ఈటల రాజేందర్‌

ఛత్రపతి శివాజీ వారసుడి కన్నుమూత.. మోదీ సంతాపం

Last Updated : Sep 14, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details