Etela rajender at HICC: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈటలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ నుంచి ఈటలకు ఒక్కరికే మాట్లాడే అవకాశం వరించింది. తెలంగాణలో రాజకీయాలు, పార్టీ బలోపేతంపై ఈటల మాట్లాడగా.. చాలా బాగా మాట్లాడారంటూ భాజపా ప్రతినిధుల ప్రశంసించినట్లు తెలుస్తోంది. సమావేశాల్లో మాట్లాడిన అనంతరం మీడియాతో ఈటల మాట్లాడారు. తెలంగాణపై భాజపా అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోందని ఈటల వెల్లడించారు.
ఇవీ చదవండి: