BJP MLA Candidates Selection Telangana 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రతి పార్టీ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్లను దాదాపుగా ఖరారు చేసింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇటీవలే పూర్తి చేసింది. తాజాగా రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) టికెట్‌కు ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్యంలోని కమిటీ దరఖాస్తులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
Congress MLA Candidates Selection Telangana: రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం డిసెంబరు నెలలో శాసనసభ ఎన్నికలు(Assembly Elections) జరగాలి. దీనికోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ 119 నియోజక వర్గాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రక్రియను గత నెల 29తో ముగించింది. సుమారు 1017 దరఖాస్తులు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 34 నియోజక వర్గాల్లో 10 కన్నా ఎక్కువ అర్జీలు వచ్చాయని వెల్లడించింది. మరికొన్ని నియోజక వర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. దీంతో ఆ పార్టీ ప్రధాన నాయకులు టికెట్ ఎవరికి ఇవ్వాలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరిపింది. టికెట్లు కేటాయించే విషయంలో బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇది ఇలా ఉంటే కొన్నిచోట్ల ఏకగ్రీవంగా వ్యక్తులను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న నాయకుల మధ్య వాగ్వాదాలను తొలగించే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ చేసే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని పలువురు నాయకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ బలమైన వ్యూహాలు అమలు చేస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించింది.