BJP MLA Candidate Applications Telangana 2023 :ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరగనుండగా.. అందులో ఒకటి తెలంగాణ. రాష్ట్రంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనున్నట్లు సమాచారం. శాసన సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్ని సన్నద్ధం అవుతున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీకి ఈసారి ఎలాగైన గెలిచే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు తమ వంతు కృషి చేస్తూ.. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుసున్నాయి. అందులో భాగంగా ఎన్నికల్లో ప్రముఖ ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తున్నాయి.
Applications for BJP MLA Aspirants Telangana 2023 :ఇటీవలే కాంగ్రెస్ పార్టీ(Telangana Congress MLAs List) తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో పార్టీ ప్రాధాన నాయకులు ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ అంశంపై స్క్రీనింగ్ కమిటీని వేసింది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఈ నెల 15 తరవాత తొలి జాబితాను ప్రకటించనుంది. ఇదే పంథాను బీజేపీకూడా అనుసరిస్తోంది.
శాసనసభ ఎన్నికలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి బీజేపీదరఖాస్తులు స్వీకరిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో మాగం రంగారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు రవిప్రసాద్‌గౌడ్ తొలి దరఖాస్తు(BJP MLA Candidate Application) అందించారు. జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు చేసుకున్నారు.