తెలంగాణ

telangana

ETV Bharat / state

'12లక్షల సభ్యత్వాలే భాజపా లక్ష్యం..!' - BJP Membership_2019

జులై 6 నుంచి భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం కానుంది. సభ్యత్వ నమోదులో రాష్ట్ర స్థాయి నుంచి బూత్​ స్థాయి వరకు నేతలంతా పాల్గొనాలని రాష్ట్రపదాధికారుల సమావేశంలో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సూచించారు.

BJP Membership

By

Published : Jun 26, 2019, 5:57 PM IST

జులై 7 నుంచి ఆగస్టు 11వరకు నిర్వహించే సభ్యత్వ క్యాంపెయిన్‌లో ప్రతి కార్యకర్త పాల్గొనేలా కృషి చేయాలని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 6న ప్రారంభంకానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు నేతలంతా సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో 12లక్షల సభ్యత్వాలు జరగాలని ఆదేశించినట్లు సమాచారం.

'జూలై 6నుంచి భాజపా సభ్యత్వ నమోదు'

ABOUT THE AUTHOR

...view details