త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ప్రేమేందర్ రెడ్డి - హైదరాబాద్ తాజా సమాచారం
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో విస్తృత చర్చ నిర్వహించారు. ప్రభుత్వ అవినీతిని ఈ ఎన్నికల్లో ఎండగడతామని ఆయన అన్నారు.
![జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ప్రేమేందర్ రెడ్డి BJp meeting on GHMC elections on hyderabad party office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9467752-614-9467752-1604752882888.jpg)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం : ప్రేమేందర్ రెడ్డి
రెండు పడక గదుల ఇల్లు, ఎల్ఆర్ఎస్, వరద సాయంపై అవినీతికి పాల్పడుతున్న తెరాసకు ఈ ఎన్నికల్లో అంతం ఖాయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సన్నవరికి 500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.