పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు రాష్ట్ర భాజాపా మహిళా మోర్చా ధర్నా నిర్వహించింది. కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఈ విధానం తీసుకొచ్చారని మోర్చా నాయకులు మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి నగరంలోని అనేక బస్తీల్లో గుడిసెలను కూల్చివేసి నిరుపేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
'ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్ విధానం' - హైదరాబాద్‌లోని నాంపల్లిలో భాజాపా మహిళా మోర్చా ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని రాష్ట్ర భాజాపా మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ విధానం పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు మోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు.
!['ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్ విధానం' bjp mahila morcha dharna against lrs in nampally hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9054923-451-9054923-1601885425549.jpg)
ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్ విధానం: భాజాపా మహిళా మోర్చా
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎన్నికలు వచ్చినప్పుడే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గుర్తుకు వస్తుందని మోర్చా నాయకులు ఎద్దేవా చేశారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి నిరుపేదలకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం