BJP Maha Dharna at Indira Park : రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. గత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ రెండు పడక గదుల ఇళ్ల హామీ ఇచ్చి విస్మరించిందని.. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి : కిషన్‌రెడ్డి
Kishan Reddy Speech at BJP Maha Dharna Indira Park: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయని.. భూమి మీద ఉండవని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్త శుద్ధి లేదని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే.. ఓట్లు అడగనని 2017లో కేసీఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రగతిభవన్‌ను 4 నెలలు, సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించారని.. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్ల సమయం పడుతోందని విమర్శించారు. అక్కడక్కడ కొన్ని కట్టినా.. ఆ ఇళ్లను ఇంకా ప్రజలకు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదని ఆక్షేపించారు.
రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది: కిషన్‌రెడ్డి
కేసీఆర్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయి.. భూమి మీద ఉండవు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే.. ఓట్లు అడగనని 2017లో కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌ను 4 నెలలు, సచివాలయాన్ని 8 నెలల్లో నిర్మించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్లు పడుతోంది. అక్కడక్కడ కట్టినా.. ఇళ్లు ఇంకా ప్రజలకు పంపిణీ చేయడం లేదు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే.. పేదవాళ్ల ఇంటి కల ఎప్పటికీ తీరదు. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు