తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Lifted Suspension on MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత - Telangana BJP Latest News

Rajasingh
Rajasingh

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 11:25 AM IST

Updated : Oct 22, 2023, 3:18 PM IST

11:20 October 22

BJP Lifted Suspension on MLA Rajasingh : రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు

BJP Lifted Suspension on MLA Rajasingh రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు

BJP Lifted Suspension on MLA Rajasingh : శాసనసభ ఎన్నికల అభ్యర్థిత్వాల ప్రకటనకు ముందు భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. గోషామహల్ శాసన సభ్యుడు రాజాసింగ్‌పై (Rajasingh) సస్పెన్షన్ ఎత్తివేసింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున ఆయనపై పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సస్పెండ్ చేసింది. ఆగస్టు 23 2022న రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి వివరణ కోరింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిత్వాల ఖరారు వేళ రాజాసింగ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది. రాజాసింగ్‌ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ తెలిపారు. గోషామహల్ నుంచి పోటీ చేస్తానని రాజాసింగ్ గతంలోనే ప్రకటించారు.

MLA Raja Singh on BJP Ticket : 'నా ప్రాణం పోయినా.. బీఆర్ఎస్/ కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లను'

Telangana BJP MLA Candidates First List 2023 : ఈ క్రమంలోనే శాసనసభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. అందులో రాజాసింగ్‌ పేరు కూడా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై రాజాసింగ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. గోషామహల్‌లో తిరిగి గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం అండగా నిలబడిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

MLA Rajasingh Latest Speech : 'వచ్చే శాసనసభలో నేను ఉండకపోవచ్చు..' ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అసలేం జరిగిదంటే : గతేడాది ఆగస్టులో ఓ వర్గంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడారని ఖాదర్‌ఖాన్‌ అనే వ్యక్తి మంగళ్​హాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ డిమాండ్ చేశాయి.

Raja Singh on Uniform Civil Code : 'ఉమ్మడి పౌరస్మృతిని ఎవరూ ఆపలేరు'

చంపుతామని మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్​

Last Updated : Oct 22, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details