తెలంగాణ

telangana

ETV Bharat / state

TARUN CHUGH: 'ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారు..!' - telangana 2021 news

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, భాజపా సీనియర్ నాయకుడు లక్ష్మణ్​లు పాల్గొన్నారు. తెరాస పాలనును తరుణ్​చుగ్ ఆలీబాబా 40 దొంగలతో పోల్చారు.

bjp-leaders-tarun-chugh-and-laxman-comments-on-trs-govt
'ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారు..!'

By

Published : Aug 28, 2021, 2:47 PM IST

తెరాస పాలనను ఆలీబాబా 40 దొంగలతో పోల్చారు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్. ఈ యాత్రతో కేసీఆర్ లంక కొట్టుకుపోతుందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలగాలని అన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో మార్పు రావాలని ఆకాంక్షించారు.

'ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారు..!'

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర షురూ చేశాం. రాష్ట్రాన్నికేసీఆర్ లూటీ చేశారు. అలిబాబా 40 దొంగల్లా పాలన చేస్తున్నారు. ఈ రావణ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం. - తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

రాష్ట్రంలో తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని సీనియర్ నాయకులు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనను అంతే చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించేటటువంటి యాత్ర ఈ ప్రజా సంగ్రామ యాత్ర. ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలివేయడానికి, యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి తట్టి లేపడానికి కొనసాగే యాత్ర.. ఈ ప్రజా సంగ్రామ యాత్ర. ఈ యాత్ర ద్వారా టీఆర్​ఎస్​కు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పి చూపడానికి ప్రజలు మరి ఈ రోజు బ్రహ్మరథం పడ్తూ... మిగితా పార్టీలన్నీ కూడా ఒక గూటి పక్షులే. కాంగ్రెస్, టీఆర్​ఎస్, మజ్లిస్ పార్టీ వేరే కాదు.

- లక్ష్మణ్, భాజపా సీనియర్ నాయకులు

ఇదీ చూడండి:Minister KTR: హైదరాబాద్​లో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నాం

ABOUT THE AUTHOR

...view details