ముషీరాబాద్ నియోజకవర్గంలో భాజపా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హులకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అర్హులకు టికెట్లు ఇవ్వాలని... భాజపా కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే వారికే టికెట్ ఇవ్వాలన్నారు. అక్రమ దందాలు చేసే వారికి ప్రాధన్యత ఇస్తూ... వారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కిరోసిన్ పోసుకుని భాజపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం - భాజపా కార్యకర్తల ఆందోళన
పార్టీకోసం కష్టపడే వారికి కాకుండా... అక్రమార్కులకు టికెట్లు ఇస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భాజపా కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
కిరోసిన్ పోసుకుని భాజపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం