తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒంటరిగానే పురపోరుకు... కోర్‌ కమిటీ భేటీలో భాజపా నిర్ణయం - muncipal elections

మున్సిపల్​ ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మంచి ఫలితాలను సాధించాలని భాజపా ముఖ్యనేతలు నిర్ణయించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ రామచంద్రరావు దుయ్యబట్టారు. నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే భాజపా సభకు కేంద్ర మంత్రులు జితేందర్‌సింగ్‌, కిషన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు.

bjp leaders spoke on muncipal elections
ఒంటరిగానే పురపోరుకు... కోర్‌ కమిటీ భేటీలో భాజపా నిర్ణయం

By

Published : Dec 30, 2019, 9:20 AM IST

పుర పోరులో భాజపా ఒంటరిగానే పోటీ చేయనుంది. ఎన్నికలు జరిగే అన్ని వార్డులు, డివిజన్లలో ఒంటరిగా బరిలోకి దిగనుంది. మరోవైపు పురపాలక, నగరపాలక సంస్థల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది. మున్సిపల్‌ ఎన్నికలపై భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మంచి ఫలితాలు సాధించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యనేతలు కీలక బాధ్యతలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. తెరాసకు మేలు చేసేందుకే.. రిజర్వేషన్ల ఖరారుకు ముందే షెడ్యూల్‌ ప్రకటించిందని ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టింది.

బలంగా ఉన్న చోట ముందే ఛైర్మన్​ అభ్యర్థుల ప్రకటన

ఛైర్మన్‌, మేయర్‌ అభ్యర్థుల ప్రకటన ముందే ఉండదని.. బలమైన నేతలు ఉన్నచోట పార్టీ అనుమతితో ప్రకటించాలని కోర్‌కమిటీ అభిప్రాయపడింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలకు క్లస్టర్లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లవారీగా మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో పోలింగ్‌బూత్‌లో స్థానికంగా ఉన్న 10మంది కార్యకర్తలతోపాటు ఎన్నికలు లేని మండలాల నుంచి ఐదుగురి చొప్పున 15మందితో ప్రచారవ్యూహాన్ని భాజపా ఖరారుచేసింది. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని.. ఇతర దేశాల నుంచి వచ్చిన హిందూ శరణార్థుల కోసమేనన్న విషయాన్ని బాగా ప్రచారం చేయాలని, కేంద్రం నుంచి మున్సిపాల్టీలకు వచ్చిన నిధుల గురించి వివరించాలని నిర్ణయించారు. కార్పొరేటర్‌ అభ్యర్థులకు రాష్ట్ర అధ్యక్షుడు, కౌన్సిలర్‌ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షులు బి-ఫాంలు ఇవ్వనున్నారు.

నేడు ఇందిరాపార్కు వద్ద సభ

రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాస సర్కారు ఒత్తిడితో వ్యవహరిస్తోందని, అధికారపక్షానికి మేలు జరిగేలా కుట్ర జరిగిందని ఎమ్మెల్సీ విమర్శించారు. మజ్లిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని.. ఆ పార్టీ సభలు, ర్యాలీలకు అనుమతులిస్తూ భాజపాకు నిరాకరిస్తోందన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే భాజపా సభకు కేంద్ర మంత్రులు జితేందర్‌సింగ్‌, కిషన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. 30న నిజామాబాద్‌లో, ఆదిలాబాద్‌లో అనుకున్న సభలు జనవరి 3కు మార్చినట్లు చెప్పారు.

ఇవీ చూడండి: రెండో విడత పల్లె ప్రగతికి.. జనవరి 2న శ్రీకారం.!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details