తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత పాటే మళ్లీ పాడారు: ఎమ్మెల్సీ రాంచందర్​రావు - అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగంపై స్పందన

అసెంబ్లీలో గవర్నర్​ చేసిన ప్రసంగంలో కొత్తగా ఏమీలేదని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. గవర్నర్​తో ప్రభుత్వం అన్నీ అవాస్తవాలే పలికించిందని ఆరోపించారు.

BJP leaders responding to Governor's speech
'పాత పాటే మళ్లీ పాడారు'

By

Published : Mar 6, 2020, 10:55 PM IST

గవర్నర్​తో ప్రభుత్వం అబద్ధాలు పలికించిందని భాజపా నేత, ఎమ్మెల్సీ రాంచందర్​ రావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని.. పాత బాటిల్లో కొత్త సార అనే సామెతలా ఉందన్నారు.

కొత్త బాటిల్ లేదని... కొత్త సార లేదని... ఎద్దేవా చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించిందే లేదని ఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని ఆయన అన్నారు.

'పాత పాటే మళ్లీ పాడారు'

ఇవీ చూడండి:ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details