తెలంగాణ

telangana

ETV Bharat / state

'మునుగోడు ఉప ఎన్నికల్లోనే ప్రజలు బీఆర్​ఎస్​కు వీఆర్ఎస్ ఇస్తారు' - MP Laxman fires on KCR is the latest news

Bjp Leaders Reaction On Brs: కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై భాజపా నేతలు తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో తెరాసకు నూకలు చెల్లాయని అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టగా కేసీఆర్ తీరు ఉందని ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్​ఎస్​కు వీఆర్ఎస్ ఇస్తారని భాజపా నాయకులు పేర్కొన్నారు.

Bjp Leaders Reaction On Brs
Bjp Leaders Reaction On Brs

By

Published : Oct 5, 2022, 6:02 PM IST

Bjp Leaders Reaction On Brs: కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై భాజపా నేతలు తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో తెరాసకు నూకలు చెల్లాయని అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని భాజపా రాజసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. 8ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ చేసింది ఏంటో ముందు చెప్పాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాలు చేశారని ఆయన ఆరోపించారు.

అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా: యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టిన కేసీఆర్.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా అని నిలదీశారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా అని ప్రశ్నించారు. రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతా విస్తరింపజేస్తారా అని లక్ష్మణ్ ఏద్దేవా చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా అంటూ విమర్శించారు. బైంసా అల్లర్లను, హైదరాబాద్​లో తీవ్రవాద స్థావరాలను ప్రోత్సహించడం బీఆర్ఎస్​ పార్టీ దేశ రక్షణ విధానమా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ రాజకీయ పునరేకీకరణ కానే కాదు: మునుగోడు ఉప ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజలను మళ్లించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న ఉపాయాలు ప్రజలకు అర్ధమవుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడులో బీఆర్ఎస్​కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాజకీయ పునరేకీకరణ కానే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే అని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత సోకుల కోసం ఖర్చు పెట్టడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామాలని విమర్శించారు.

దేశంలో రాజకీయంగా చెలామణి కావాలని పగటి కలలు కంటున్నారు:కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టగా కేసీఆర్ తీరు ఉందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ స్థాపనతో తెలంగాణకు కేసీఆర్‌తో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని అన్నారు. కొత్త పార్టీ పెట్టుకున్న తరువాత కేసీఆర్‌ నమ్ముకున్నది మద్యం, డబ్బు, ప్రలోభాలు అని విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయంగా చెలామణి కావాలని పగటి కలలు కంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు .

ఏ రాష్ట్రంలో లేనంతంగా అత్యంత అవినీతి మోడల్ పాలన: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతంగా అత్యంత అవినీతి మోడల్ పాలనను చూపించిన దుర్మార్గుడు కేసీఆర్ అని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. 8 ఏండ్లలో అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులతో కేసీఆర్ నేల మీద నిలబడటం లేదని ఆరోపించారు. అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి అన్ని రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు . అది ఎన్నటికీ సాధ్యం కాదని డీకే అరుణ స్పష్టం చేశారు.

కేసీఆర్ పాలన అట్టర్ ఫ్లాప్​: కేసీఆర్ పాలన అట్టర్ ఫ్లాప్​ అని... సచివాలయమే వెళ్లని సీఎంగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయారని డీకే అరుణ ఆరోపించారు. జాతీయ పార్టీ పెట్టి ఇదే మోడల్ చూపించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రతి దానికి తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని కాలం గడిపిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్ధమయ్యారని విమర్శించారు.

దొంగ దీక్ష చేసి తెలంగాణ ప్రజలను నమ్మించినట్లే భారతదేశ ప్రజలందరినీ నమ్మించాలని కేసీఆర్ నాటకాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ సంగతి దేవుడెరుగు తెరాస పార్టీ అస్థిత్వమే ఇప్పుడు పోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్​కు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతోనే ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారని డీకే అరుణ విమర్శించారు.

ఇవీ చదవండి:'బీఆర్ఎస్​ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు'

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి

వాహనం సీక్రెట్​ పైపులో 23కేజీల బంగారం స్మగ్లింగ్.. ఒకే నెలలో 121కిలోలు సీజ్

ABOUT THE AUTHOR

...view details