కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర రావు తీరును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ విషయంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా వ్యవహరించారని భాజపా ఆరోపించింది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసన ప్రదర్శనలు - తెలంగాణలో భాజపా నిరసనలు
అయోధ్య రామమందిర నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే విద్యాసాగర రావు ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా వ్యవహరించారని భాజపా పేర్కొంది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసన ప్రదర్శనలు
ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు వివరణ ఇవ్వనందుకు నిరసన ప్రదర్శన చేపట్టాలని భాజపా పిలుపునిచ్చింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో తెరాస, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశించారు.
ఇదీ చూడండి:ఓటీపీ ద్వారా రేషన్ బియ్యం... ఉత్తర్వులు జారీ