తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్ఎస్​ రద్దు చేయాలంటూ భాజపా నేతల నిరసన - telangana lrs scheme lastest news

హైదరాబాద్​ గోల్కొండ ఎమ్మార్వో కార్యాలయం వద్ద భాజపా నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఎల్​ఆర్ఎస్​ రద్దు చేయాలంటూ భాజపా నేతల నిరసన
ఎల్​ఆర్ఎస్​ రద్దు చేయాలంటూ భాజపా నేతల నిరసన

By

Published : Sep 29, 2020, 2:24 PM IST

పేద ప్రజల నడ్డివిరిచే ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని మంగళవారం ఉదయం గోల్కొండ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భాజపా లంగర్​హౌస్​ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రాన్ని అందించారు.

పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్న ఈ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రజలు ఎల్​ఆర్​ఎస్​ భయంతో ప్లాట్ల లావాదేవీలు చేయట్లేదని.. కొన్నవారు కూడా ఎల్​ఆర్​ఎస్​ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో భాజపా లంగర్​హౌన్​ డివిజన్​ అధ్యక్షుడు నాగేంద్ర, ప్రకాష్​రెడ్డితో పాటు శ్రవంత్​, రాజేష్​ తదితర భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details