సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. బోయిన్‌పల్లికి చెందిన ఇర్ఫాన్.. మాయమాటలు చెప్పి యువతిని నిర్బంధించి.. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు.
'అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి' - హైదరాబాద్ వార్తలు
యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ... బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా నేతలు ఆందోళనకు దిగారు.
'అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి'
యువతి కనిపించకపోవడంతో... ఆమె తల్లిదండ్రులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో యువతి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి... న్యాయం చేయాలంటూ స్టేషన్ ముందు భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.