హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. కరోనా పేరుతో శ్వేత అనే మహిళ వద్ద లక్షల్లో డబ్బు గుంజి, చివరకు గుండెపోటుతో మరణించిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపించారు. సెప్టెంబర్ మూడో తేదిన చనిపోతే 4న మృతి చెందినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని మండిపడ్డారు.
మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నేతల అరెస్టు - మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నేతల ధర్నా
హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా వచ్చిందటూ శ్వేత అనే మహిళ వద్ద లక్షల్లో డబ్బులు గుంజారని ఆరోపించారు.
మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నేతల అరెస్టు
శ్వేత రిపోర్టుల కోసం ఆస్పత్రికి వెళ్లిన మాధవరావును యాజమాన్యం నిర్బంధించిందని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన భాజపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. మలక్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.