తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ మరోసారి హైకోర్టుకు భాజపా - another petition on MLAs poaching case

'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ భాజపా నేత పిటిషన్‌
'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ భాజపా నేత పిటిషన్‌

By

Published : Nov 10, 2022, 4:20 PM IST

Updated : Nov 10, 2022, 4:46 PM IST

16:12 November 10

'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ భాజపా నేత పిటిషన్‌

ఎమ్మెల్యేల ఎర కేసులో దర్యాప్తును నిలిపివేయాలని భాజపా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను నిలుపుదల చేయాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్‌లో వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. భాజపాను దుష్ప్రచారం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఉపయోగించుకుంటోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై లోతైన విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.

అయితే భాజపా మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసులో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. పిటిషన్ విచారణలో ఉండగానే సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి వీడియోలు విడుదల చేయడం, పలువురు భాజపా నేతల పేర్లు బయటపెట్టడం వెనక కుట్ర ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై డివిజన్ బెంచ్‌లో వాదనలు జరిగే అవకాశం ఉంది.

పోలీసుల కస్టడీలో నిందితులు..: ఈ కేసు నిందితులను మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ నుంచి ముగ్గురు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్టయిన నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి స్వామీలను ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అ.ని.శా. కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను తీసుకెళ్లిన పోలీసులు సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారిని తిరిగి చంచల్​గూడ జైలుకు పంపిస్తారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి..:

పోలీసు కస్టడీలో 'ఎమ్మెల్యేలకు ఎర కేసు' నిందితులు

శరత్, వినయ్‌బాబును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఈడీ.. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌

Last Updated : Nov 10, 2022, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details