అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన కొనసాగుతోందని అన్నారు.
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన: భాజపా - బండి సంజయ్ వార్తలు
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన కొనసాగుతోందని కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
కిషన్ రెడ్డి, వివేక్
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!