కాళికామాత ఆలయానికి చెందిన స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దంటూ భాజపా నాయకులు అడ్డుకున్నారు. హైదరాబాద్ ఛత్రినాక పీఎస్ పరిధిలోని భయ్యాలాల్ నగర్లో ఈ సంఘటన జరిగింది.
నిర్మాణ పనులను అడ్డుకున్న భాజపా నాయకులు - కాళికమాత ఆలయ స్థలమంటూ భాజపా ఆందోళన
హైదరాబాద్ ఛత్రినాక పీఎస్ పరిధిలోని భయ్యాలాల్ నగర్లో చేపడుతున్న నిర్మాణ పనులను భాజపా నాయకులు అడ్డుకున్నారు. కాళికామాత ఆలయానికి చెందిన స్థలంలో నిర్మాణాలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు.
![నిర్మాణ పనులను అడ్డుకున్న భాజపా నాయకులు BJP leaders obstruct construction work in Chatrinaka in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9899130-288-9899130-1608118847805.jpg)
ఛత్రినాకలో నిర్మాణ పనులను అడ్డుకున్న భాజపా నాయకులు
కోర్టు ఆదేశాలు ఇవ్వగా పోలీసు బలగాల సహకారంతో నిర్మాణ పనులు జరుగుతుండగా స్థానిక మహిళలు, భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పనులను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. కాసేపు పోలీసులకు, భాజపా నాయకులకు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.