తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్​కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది' - బీజేపీ దీక్ష

BJP Leaders Nirasana Deeksha in Hyderabad : జమిలి ఎన్నికలు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్​ భయపడుతున్నారని.. వాటి గురించి కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్​లో బీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో సంజయ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

Bandi Sanjay Attend BJP Nirasana Deeksha
BJP Nirasana Deeksha in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 6:52 PM IST

BJP Leaders Nirasana Deeksha in Hyderabad : బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. బీఆర్ఎస్​ 9ఏళ్ల పాలనలో.. ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ(BJP) ఇవాళ నిరసన దీక్ష చేపట్టింది. హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉదయం 11 గంటల నుంచి గురువారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలు ఆందోళన చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(BJP State President Kishan Reddy), జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay), పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పదాధికారులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ మాట్లాడుతూ.. సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్​ అధికారకంగా నిర్వహించలేదని తెలిపారు.

Bandi Sanjay Fire on CM KCR: మజ్లిస్​ కోసమే జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని ఆరోపించారు. ఈ దినోత్సవం పబ్లిక్​ గార్డెన్​లో కాకుండా దారుసలాంలో చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ జమిలి ఎన్నికలు అంటే భయపడుతున్నారని.. ఆ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర చెప్పే వరకు ఓపిక లేకుండా కేసీఆర్​ కుటుంబం వనికిపోతుందని విమర్శించారు. జమిలి ఎన్నికలు జరిగినా.. షెడ్యూల్​ ప్రకారం సింగిల్​గా జరిగినా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది​'

మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి ఎలాంటి పవర్​ లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రివర్గం కంటే ముఖ్యమంత్రికి సలహాదారులే ఎక్కువని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే జీతాలు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్​ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు.

"ఒక కుటుంబం చేతిలో తెలంగాణ సర్వనాశనం అయింది. కాంగ్రెస్​ పార్టీ నాయకులు గెలిస్తే మళ్లీ బీఆర్​ఎస్​లోకే వెళతారు. నయా రజాకార్ల పార్టీని.. కేసీఆర్​ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం. కేసీఆర్​కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది. బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, జీతాలు రావు. ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్​ నిర్వీర్వం చేశారు. బీఆర్​ఎస్​ వస్తే మళ్లీ ప్రజలకి అన్యాయం జరుగుతుంది." - బండి సంజయ్​, జాతీయ ప్రధానకార్యదర్శి

Bandi Sanjay Comments హైదరాబాద్​లో బీఆర్​ఎస్​కి వ్యతిరేకంగా బీజేపీ దీక్ష

Bandi Sanjay Condemned Chandrababu Naidu Arrest : 'చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన విధానం సరైంది కాదు'

Bandi Sanjay on Telangana Liberation Day 2023 : 'విమోచన దినోత్సవాలు అధికారికంగా జరపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే'

Bandi Sanjay Cycle Ride : సైకిలెక్కిన బండి.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు

ABOUT THE AUTHOR

...view details