తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది' - తెలంగాణ వార్తలు

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని దుబ్బాక ఉప ఎన్నిక భాజపా ఇంఛార్జి జితేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రఘునందన్‌రావు అనుకుంటున్నామని... అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత రావాలని పేర్కొన్నారు.

'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది'
'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది'

By

Published : Oct 4, 2020, 11:44 AM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఎవరనేది కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని మాజీ ఎంపీ, దుబ్బాక ఉప ఎన్నిక భాజపా ఇంఛార్జీ జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్​లోని ఆపార్టీ కార్యాలయంలో దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో భాజపాకు ఆదరణ బాగుందని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పకడ్బందిగా కమిటీలు వేసినట్లు వివరించారు.

భాజపా సహకారంతోనే తెలంగాణ సాధించుకున్నామన్న ఆయన.. నేడు సీఎం కేసీఆర్​ కుటుంబం కోసమే నడుస్తోందని విమర్శించారు. జూబ్లిహిల్స్​ మాదిరిగా సిద్దిపేట, గజ్వేల్‌లో భవనాలు కనిపిస్తుంటే.. దుబ్బాకలో అనేక సమస్యలు కొలువై ఉన్నాయన్నారు. దుబ్బాక అభివృద్ధి చెందాలంటే భాజపాను గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి:దుబ్బాక పోరు: అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్​ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details