పార్టీ సంస్థాగత , మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె అంశాలపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. పదాధికారులు,జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సభ్యత నమోదు ప్రముఖ్,సహా ప్రముఖ్లు, గతంలో భాజపా నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి భాజపా జాతీయ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి, కేంద్ర మాజీమంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం నమోదు అంశాలను రాధామోహన్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. నవంబర్ చివరి కల్లా జిల్లా కమిటీలను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.
'నవంబర్ చివరినాటికి జిల్లా కమిటీలను పూర్తి చేయాలి' - bjp leaders meeting
భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై పార్టీ నేతలు సమావేశమయ్యారు. నవంబర్ చివరి కల్లా జిల్లా కమిటీలను పూర్తి చేయాలని భాజపా జాతీయ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి, కేంద్ర మాజీమంత్రి రాధామోహన్ సింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై భాజపా నేతలు భేటీ
మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై భాజపా నేతలు భేటీ
ఇదీ చదవండిః "మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి"