తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Mouna Deeksha in Hyderabad : 'తెలంగాణలో సర్కార్​కు.. ప్రజలకు మధ్య యుద్ధం' - తెలంగాణ వార్తలు

BJP Mouna Deeksha in Hyderabad : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టుకు నిరసనగా భాజపా నేతలు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భాజపా నేతలు లక్ష్మణ్, విజయశాంతి.. తెరాస తీరుపై నిప్పులు చెరిగారు.

BJP Mouna Deeksha in Hyderabad , BJP leaders comments
భాజపా మౌన దీక్ష

By

Published : Jan 4, 2022, 1:31 PM IST

భాజపా మౌన దీక్ష

BJP Mouna Deeksha in Hyderabad : రాష్ట్రంలో యుద్ధం మొదలైందని.. ఈ యుద్ధం తెరాస సర్కార్​కి, తెలంగాణ ప్రజలకి మధ్య జరుగుతోందని భాజపా నేత లక్ష్మణ్‌ అన్నారు. అవినీతి కుటుంబ, నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో భాజపా నేతలు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. భాజపా నేతలు లక్ష్మణ్‌, రాజాసింగ్‌, విజయశాంతి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష చేసి.. విరమించారు.

యుద్ధం ప్రారంభం

Lakshman fires on CM KCR : తెలంగాణలో యుద్ధం మెుదలైందని భాజపా నేత లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామనే... రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెరాస కుట్రలకు ప్రజలు బుద్ధి చెబుతారని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన మౌన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలవల్లే... తప్పుడు ఆరోపణలతో బండి సంజయ్​ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంలో భాజపా అగ్రభాగంలో ఉందని భావించారు. ప్రజల్లో భాజపా బలం పెరుగుతోందని వాళ్లు అరెస్టు చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు.

-లక్ష్మణ్, భాజపా నేత

రాములమ్మ ఫైర్

vijayashanthi Fires on TRS : తెరాస కనుమరుగయ్యే పరిస్థితి దగ్గర్​లో ఉందని భాజపా సీనియర్‌ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మౌనదీక్షకు హాజరైన విజయశాంతి.. సంజయ్‌తో పాటు భాజపా శ్రేణులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి 317 జీవోకు సవరణ చేయాలని.. నిరుద్యోగులు, రైతుల పక్షాన భాజపా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తీరతామని విజయశాంతి ప్రకటించారు.

రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్​ను గద్దె దించడం ఒక్కటే మార్గం. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. డబ్బుతో ఏదైనా చేయగలనని అనుకుంటున్నారు. రాష్ట్రంలో యుద్ధం మొదలైంది. మేమంతా కలిసి ఎదురుతిరగబోతున్నాం. కేసీఆర్ గొయ్యి.. ఆయనే తవ్వుకున్నారు. తెరాస పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి రానుంది.

-విజయశాంతి, భాజపా నేత

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ భాజపా నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:Corona Cases in gurukul college: కళాశాలలో కరోనా కలకలం.. ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details