తెలంగాణ

telangana

ETV Bharat / state

రామతీర్థం ఉద్రిక్తం.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం

ఏపీలో భాజపా, జనసేన నేతల చలో రామతీర్థం పిలుపు మేరకు పోలీసులు ముఖ్య నేతలను గృహ నిర్భంధించారు. దీనిపై భాజపా, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jan 5, 2021, 1:29 PM IST

ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం
ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం

భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అరెస్టు..

ఏపీలో చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఏపీ విశాఖ నుంచి రామతీర్థం వెళ్లే ముఖ్య నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్దే అడ్డుకున్నారు. భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సెక్షన్ 151 ప్రకారం నోటీసులు అందజేసి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధించారు. దీంతో ప్రభుత్వ చర్యల పై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం

భాజపా, జనసేన నాయకులు గృహ నిర్భంధం..

చలో రామతీర్థం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ విశాఖ జిల్లా నర్సీపట్నం భాజపా, జనసేన నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీలకు చెందిన నాయకులను ఎక్కడికక్కడే నిర్బంధించారు. జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు కాళ్ల సూర్యచంద్రులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నాతవరం మండలం చెర్లపాలెం లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ఉన్న భాజపా, జనసేన నాయకులను గృహ నిర్బంధం చేశారు.

కార్యాలయంలోనే సీఎం రమేశ్​, కామినేని శ్రీనివాసరావు..

విశాఖ భాజపా కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 'చలో రామతీర్ధ' కార్యక్రమంలో పాల్గొనడానికి కార్యాలయానికి వచ్చిన ఎంపీ సీఎం రమేశ్​, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులను ఏసీపీ మూర్తి, పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయ గేట్ మూసివేసి నేతలను కార్యాలయంలోనే నిలువరించారు. పోలీసుల తీరుపై సీఎం రమేశ్​, కామినేనిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోనసీమలో భాజపా నాయకులు అరెస్ట్..

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. కొత్తపేటలోని రాష్ట్ర భాజపా నాయకులు పాలూరి సత్యానందం ను పోలీసులు రామతీర్థం వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై సత్యానందం తప్పబట్టారు.

ఇంటిలోనే కురుపాం నేతలు ..

పార్వతీపురం కురుపాం నియోజకవర్గం నుంచి రామతీర్థంలో ధర్మయాత్ర కార్యక్రమానికి బయలుదేరుతున్న భాజపా, జనసేన నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుర గాల ఉమామహేశ్వరరావు, నాయకులు సాయి పార్థసారథి, తాళాబత్తుల శ్రీనివాసరావులను గృహ నిర్బంధం చేశారు. హిందూ దేవాలయాల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శాంతియుత కార్యక్రమానికి బయలుదేరుతున్న భాజపా నాయకులను గృహనిర్బంధం చేయడం ప్రభుత్వానికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు మోహరింపు..

విజయనగరం నెల్లిమర్ల మండలం, రామతీర్థం రాములోరి విగ్రహం ధ్వంసం ఘటనపై భారతీయ జనతా పార్టీ, జనసేన తలపెట్టిన చలో రామతీర్థం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎత్తు బ్రిడ్జి కూడలిలో భారీగా మోహరించారు. వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ వాహనాలు పంపిస్తున్నారు.

ఇదీ చదవండి:అన్నదాతకు దక్కని 'మద్దతు'- అందుకే ఆందోళన

ABOUT THE AUTHOR

...view details