హైదరాబాద్ గన్ ఫౌండ్రి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ హోం ప్రకాష్ ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలకు ఆ పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా నిత్యావసర సరకులు అందజేశారు. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
Grocery Distribution: నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నేతలు - తెలంగాణ వార్తలు
కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా... ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్లో అన్నదానం, నిత్యావసర సరకుల(Grocery Distribution)ను పంపిణీ చేశారు. గన్ ఫౌండ్రి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ హోం ప్రకాష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలకు భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా నిత్యావసర సరకులు అందజేశారు.
Grocery Distribution: నిత్యావరాలు పంపిణీ చేసిన భాజపా నేత
దేశంలోని ప్రతి పౌరున్ని ఆదుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కొప్పు బాషా తెలిపారు. సేవాహీ సంఘటన్ పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి... ఆస్పత్రుల్లో వ్యాక్సిన్, అడ్మిషన్ సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం