గణపతి ఉత్సవాల సందర్భంగా... నవరాత్రులపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలంటూ భాజపా నేతలు ఆందోళనకు దిగారు. అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ భాజపా నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
'మండపాల వద్ద దాడులు జరిగితే సహించేది లేదు' - మైత్రీవనం వద్ద భాజపా నాయకుల ఆందోళన
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం అన్యాయమని పలువురు భాజపా నేతలు ఆందోళనకు దిగారు. అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
'మండపాల వద్ద దాడులు జరిగితే సహించేది లేదు'
పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి... స్టేషన్‌కు తరలించారు. మండపాల వద్ద భక్తులు, కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి:భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ