తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగం: ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ - ఈసీకి భాజపా నేతల ఫిర్యాదు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస నేతల తీరుపై ఈసీకి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్ ఆరోపించారు. సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

nvss prabhakar
ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

By

Published : Mar 5, 2021, 7:45 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెరాస పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్​గోయల్​కు పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేసిన ఆయన.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులపై శాఖాపరమైన బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభాకర్‌ ఆరోపించారు.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా హామీలిస్తున్నారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాలు, మంత్రుల పర్యటనలపై ఈసీ ప్రత్యేక పరిశీలకులను నియమించాలని వారు కోరారు. మంత్రుల పర్యటనపై త్వరలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని శశాంక్​ గోయల్​ హామీ ఇచ్చారని ప్రభాకర్‌ తెలిపారు.

ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగం: ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

ఇదీ చదవండి:గిరిజనులకు పౌష్టికాహారం అందుబాటులో ఉంచాలి: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details