ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాజపా నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంజీవయ్య పార్కులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, సీనియర్ నేతలు చింతల రామచందర్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి తదితరులు ఆసనాలు వేశారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంసృతిక కార్యక్రమాలు, యోగాసనాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
నెక్లెస్‌రోడ్‌లో భాజపా యోగా వేడుకలు - bjp
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భాజపా శ్రేణులు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. జై భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ లో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాజపా నేతలు పాల్గొన్నారు.
నెక్లెస్‌రోడ్‌లో భాజపా యోగా వేడుకలు