రాష్ట్రంలో ఎక్కడికక్కడ భాజపా నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా... పోలీసులు అప్రమత్తమయ్యారు. భాజపా నేతలను ముందస్తు అరెస్టు చేయడంతో పాటు కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. అసెంబ్లీ ముట్టడికి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భాజపా నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం... నేతల ముందస్తు అరెస్టు - అసెంబ్లీ ముట్టడి
తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వగా... పోలీసులు అప్రమత్తమయ్యారు. భాజపా నేతలను ఎక్కడికక్కడగా ముందస్తు అరెస్టు చేస్తున్నారు. అంసెబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
bjp leaders arrested in telangana for protest
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాలలో భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్ భాజపా నాయకులను ఉదయం 5 గంటల నుంచి ఎక్కడి వారిని అక్కడే అరెస్టులు చేసి ఆయా మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.