హైదరాబాద్లో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వీరికి కలిగిన నష్టానికి ప్రభుత్వం రూ. పది వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ఎల్బీనగర్ పరిధిలో అధికార పార్టీ నాయకులు.. నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించట్లేదని భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
అర్హులకే రూ.పది వేల ఆర్థిక సాయం అందించాలంటూ భాజపా ధర్నా - హైదరాబాద్లో భాజపా నేతల ధర్నా
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల తర్వాత వరద నీటి ప్రవాహం ఆగినా.. బురద మాత్రం పోవట్లేదని... వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ ఎల్బీనగర్లో భాజపా నాయకులు ధర్నాకు దిగారు. మరోపక్క అర్హులైన లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
అర్హులకే రూ.పది వేల ఆర్థిక సాయం అందించాలంటూ భాజపా ధర్నా
భాజపా నాయకులు ధర్నా చేపట్టడం వల్ల కొత్తపేట- సరూర్నగర్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం స్పందించి.. నిజమైన బాధితులకే ఆర్థిక సహాయం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.