ఏపీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. రెండోసారి భాజపా చలో రామతీర్థానికి పిలుపునివ్వగా నెల్లిమర్ల కూడలి వద్ద నేతలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. భాజపా-జనసేన శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
ఉద్రిక్తత: వీర్రాజు, జీవీఎల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు - రామతీర్థ యాత్రకు బీజేపీ న్యూస్
చలో రామతీర్థానికి మరోసారి భాజపా-జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం రామతీర్థ ధర్మయాత్రతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పోలీసులు భారీగా బందోబస్తు మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉద్రిక్తత: వీర్రాజు, జీవీఎల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ క్రమంలో భాజపా ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. రెండ్రోజుల క్రితం నెల్లిమర్లలో సోము వీర్రాజు అరెస్టుతో భాజపా ఆందోళన బాట పట్టింది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితిల్లో.. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉద్రిక్తత: వీర్రాజు, జీవీఎల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు