దుబ్బాకలో భాజపా విజయభేరి మోగించడంతో హైదరాబాద్లో భాజపా నేతల సంబురాలు అంబరాన్నంటాయి. గుడిమల్కాపూర్ కబడ్డీ స్టేడియం వద్ద నాంపల్లి భాజపా ఇన్ఛార్జి దేవర కర్ణాకర్ ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.ఇది ఎంతో శుభపరిణామమని.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భాజపా తమ జెండాను ఎగురవేస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
భాగ్యనగరంలో అంబరాన్నంటిన భాజపా సంబురాలు - భాగ్యనగరంలోభాజపా నేతల సంబురాలు
దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాల్చి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భాజపా విజయకేతనం ఎగురవేయడం ఖాయమని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ భాజపా కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ భాజపా ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. నేతలు మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాల్చి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా నాట్యాలు చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని దుబ్బాక ప్రజలు మరొక్కసారి నిరూపించారని బండపల్లి సతీష్ అన్నారు.. రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ బల్దియాలో కూడా భాజపా విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: దుబ్బాక గెలుపుతో కమలదళంలో కొత్త ఉత్సాహం