తెలంగాణ

telangana

ETV Bharat / state

7.5 ఫిట్​మెంట్​ దారుణం: విజయశాంతి - విజయశాంతి వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తే.. నిరాశే ఎదురైందని భాజపా నేత విజయశాంతి అన్నారు. పీఆర్​సీ సిఫారసుతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

bjp leader vijayashanthi speak on 7.5 fitment in hyderabad
7.5 ఫిట్​మెంట్​ దారుణం: విజయశాంతి

By

Published : Jan 29, 2021, 2:50 AM IST

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 ఫిట్​మెంట్​ సిఫారసు చేయడం దారుణమని భాజపా నేత విజయశాంతి అన్నారు. గడచిన 45 ఏళ్లలో అతి తక్కువగా.. 7.5 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసిన పీఆర్​సీ నివేదిక.. ఉద్యోగుల ఆకాంక్షలపై నిప్పులు పోసిందని మండిపడ్డారు.

ఉద్యోగులు 65 శాతం ఫిట్‌మెంట్ ఆశిస్తే... అందులో సగం కూడా లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి తమకు కమీషన్ రాని పనులు చేయడని విమర్శించారు. కమీషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకు మాత్రం ఎంతైనా ఖర్చు చేస్తారని ఆరోపించారు.

ఇదీ చదవండి:ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details