తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ కళ్లల్లో భయం చూశా: విజయశాంతి - తెలంగాణ రాజకీయాలు

హాలియాలో కేసీఆర్ ప్రసంగం అంతా పాత చింతకాయ పచ్చడిలా ఉందని భాజపా నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. తెరాస ఓడిపోతుందని... సభలో కేసీఆర్ కళ్లల్లో భయం చూశానని వ్యాఖ్యానించారు.

bjp leader vijayashanthi allegations on cm kcr
కేసీఆర్ కళ్లల్లో భయం చూశా: విజయశాంతి

By

Published : Apr 15, 2021, 9:39 AM IST

నల్గొండ జిల్లాలోని హాలియా సభలో కేసీఆర్​ కళ్లల్లో భయం కనిపించిందని భాజపా నేత, మాజీ ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వం కూలిపోయే సమయం వచ్చిందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి, జానారెడ్డి మంచి మిత్రులను తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు కేసీఆర్​తో ఒప్పందం కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు.

ఒప్పందంలో భాగంగానే 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారని తెలిపారు. సరైన సమయంలో తెరాస అవినీతిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. హాలియాలో కేసీఆర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉందంటూ ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:'ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో బేరీజు వేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details