అయోధ్య రామాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ అనుకూలమా? కాదా? స్పష్టం చేయాలని భాజపా నేత విజయశాంతి అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. అయోధ్య విషయంలో ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో? మరేవిషయమై స్పందించాలన్నారు.
'రామాలయ నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా? కాదా' - విజయశాంతి వార్తలు
అయోధ్య రామాలయాన్ని దేశ ప్రజలందరూ భక్తిభావంతో స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్నారని సినీ నటి, భాజపా నేత విజయశాంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి మాదిరిగానే... భద్రాద్రిలో కూడా ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దితే ప్రజలందరూ హర్షిస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
'రామాలయ నిర్మాణంపై మీ స్పందన ఏంటి?'
రాష్ట్రంలో యాదాద్రి మాదిరిగానే... భద్రాద్రిని కూడా అభివృద్ధి చేస్తే అందరూ సంతోషపడతారని పేర్కొన్నారు. భద్రాద్రిని అభివృద్ధి చేస్తాని మంత్రులు మెలికలు పెడుతున్నారని ఆరోపించారు.