తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ 'కారు' మబ్బుల్ని మూడేళ్లలోనే చెదరగొడతారు: విజయశాంతి - సీఎం కేసీఆర్​పై విజయశాంతి ఆగ్రహం

కేసీఆర్​ ఆరోగ్యం బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉందని.. మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు విజయశాంతి అన్నారు. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానన్న కేసీఆర్​ వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. కేసీఆర్​ 'కారు' మబ్బుల్ని మూడేళ్లలోనే తెలంగాణ ప్రజలు చెదరగొడతారని విజయశాంతి అన్నారు.

vijayashanthi
కేసీఆర్​ 'కారు' మబ్బుల్ని మూడేళ్లలోనే చెదరగొడతారు: విజయశాంతి

By

Published : Feb 8, 2021, 5:59 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు విజయశాంతి అన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితే ఆందోళనకరంగా తయారైందని విమర్శించారు. తెరాస నేతల దోపిడీలతో సామాన్యుల పరిస్థితి ప్రమాదంలో పడిపోయిందని ఆరోపించారు.

మరో పదేళ్ల పాటు ఎప్పుడు ప్రగతి భవన్‌లో కనిపిస్తారో... ఎప్పుడు ఫాం హౌస్‌లో దర్శనమిస్తారో అర్థంకాని అయోమయంతో... జనం తననే భరించాలని హెచ్చరించినట్లు ఉందన్నారు. 'పదేళ్ల వరకూ ఎందుకూ.. కేసీఆర్​ 'కారు' మబ్బుల్ని.. మరో మూడేళ్లలోనే ప్రజలు చెదరగొడతారు' అని విజయశాంతి అన్నారు.

ఇవీచూడండి:పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details