తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్​ఆర్​సీపై స్వార్థ రాజకీయాలు సరికాదు' - పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాల తీరుపై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టానికి ఎన్‌ఆర్‌సీకి సంబంధం లేదని చెబుతున్నా కావాలనే ప్రతిపక్షాలు రాజకీయ కుట్ర చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. భాజపాకు అధికారం దక్కకుండా చేసేందుకు ఎవరితోనైనా కలిసేందుకు కాంగ్రెస్ దిగజారిందని ఆరోపించారు.

BJP leader ponguleti sudhakar reddy  criticizes on  opposition parties
'అధికారం కోసం ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి'

By

Published : Dec 26, 2019, 7:25 PM IST

మున్సిపల్​ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని... రాజకీయ లబ్ది కోసం తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత పొంగులేటి సుధాకర్​ రెడ్డి ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ అన్నీ తెలిసి స్వార్థపూరిత అడుగులు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ హయంలో అసదుద్దీన్... జనాభా లెక్కలు చేయలేదా...? కేసీఆర్ సకల జనుల సర్వే చేయలేదా..? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న అక్రమ చొరబాటు దారులకు పౌరసత్వం ఇవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుంధతి రాయ్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

'అధికారం కోసం ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details