భాజపా వినూత్నంగా నిర్వహించిన వర్చువల్ ర్యాలీని చూసి ఓర్వలేకే తెరాస విమర్శలు చేస్తోందని భాజపా నాయకులు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, విజయ రామారావు మండిపడ్డారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈటల అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ్నించిన భాజపాపై మంత్రి ఈటల అవాకులు, చవాకులు పేలుతున్నాడని దుయ్యబట్టారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?: పెద్దిరెడ్డి
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా నాయకులు పెద్దిరెడ్డి, విజయ రామారావు విమర్శించారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?: పెద్దిరెడ్డి
కరోనా నివారణకు కేంద్రం రాష్ట్రానికి 7 వేల 2 వందల కోట్లు ఇచ్చిందని తెలిపారు. కరోనా మృతుల వివరాలు బహిర్గతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు చేశారని.. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురు దాడికి దిగడమెంటన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.