త్యాగధనుల ఫలాలు సద్వినియోగం చేసుకునే దిశగా యువత ముందుకు సాగాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్‌లోని భాజపా క్యాంపు కార్యాలయంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించారు.
'దేశ రక్షణకు యువత నడుం బిగించాలి’ - భాజపా రాష్ట్ర మాజీ ఆధ్యక్షులు
దేశంకోసం ప్రాణాలు త్యజించిన త్యాగధనుల ఆశయాలు సాధించే దిశగా యువత అడుగు ముందుకేయాలని, దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ సూచించారు. ముషీరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయపతాకం ఆవిష్కరించారు.
'దేశ రక్షణకు యువత నడుం బిగించాలి’
సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అవగాహన పెంచుకొని యువత రాజకీయరంగంలో కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో చేపట్టిన అనేక పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దేశ రక్షణ బాధ్యతలు యువత చేతిలోనే ఉన్నాయని ఆయన అన్నారు.
ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు