తెలంగాణ

telangana

ETV Bharat / state

NVSS Prabhakar Remarks on Ministers: 'గవర్నర్ భాజపా నాయకురాలని ఆరోపించడం సిగ్గుచేటు' - Telangana bjp updates

NVSS Prabhakar Remarks on Ministers: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను భాజపా నాయకురాలని రాష్ట్ర మంత్రులు ఆరోపించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. గవర్నర్ గురించి మాట్లాడే ముందు మంత్రి కేటీఆర్ తన పరిధి తెలుసుకోవాలని హితవు పలికారు.

NVSS Prabhakar
NVSS Prabhakar

By

Published : Apr 8, 2022, 3:18 PM IST

NVSS Prabhakar Remarks on Ministers: తెలంగాణ మాదకద్రవ్యాలకు నిలయంగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందే కానీ.. విచారణ జరిపి నిందితులను శిక్షించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. సోమేశ్ కుమార్ ఒక్క క్షణం కూడా సీఎస్​గా బాధ్యతల్లో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు.

ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో మద్యమే ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రతి బార్​కు, పబ్బుకు అనుసంధానంగా డ్రగ్స్ సప్లైర్స్ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా మద్యం, బెల్టు దుకాణాలు అడ్డుగోలుగా వెలిశాయని మండిపడ్డారు. 140 దాకా పబ్బులు అధికారికంగా హైదరాబాద్​లో వెలిశాయని చెప్పారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల కోసం.. ప్రజల కష్టార్జితాన్ని మద్యం రూపంలో దోచుకుంటుందని మండిపడ్డారు.

సమ్మక్క సారక్క, యాదాద్రి పర్యటనలో గవర్నర్​కు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని ప్రభాకర్ ప్రశ్నించారు. గవర్నర్ మహిళ కాబట్టే ముఖ్యమంత్రి, మంత్రులు గౌరవించడం లేదన్నారు. గవర్నర్ భాజపా నాయకురాలని మంత్రులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. గవర్నర్​ను విమర్శించే ముందు కేటీఆర్ తన పరిధి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే గవర్నర్​కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమిళిసై మహిళ అయినందునే గౌరవించట్లేదు. భాజపా నాయకురాలని మంత్రులు ఆరోపించడం సరికాదు. సీఎం కేసీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలి. గవర్నర్‌ను విమర్శించే ముందు కేటీఆర్ తన పరిధి తెలుసుకోవాలి. సమ్మక్క- సారక్క, యాదాద్రి పర్యటనలో గవర్నర్​కు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు.

-- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

'గవర్నర్ భాజపా నాయకురాలని ఆరోపించడం సిగ్గుచేటు'

సంబంధిత కథనం..

ABOUT THE AUTHOR

...view details