తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ను వ్యతిరేకించే వారు.. మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చు' - ప్రగతిభవన్​పై విమర్శలు చేసిన ఎన్​వీఎస్​ఎస్​

BJP leader NVSS Prabhakar criticized TRS: కేసీఆర్​ను వ్యతిరేకించే వారు.. మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చని బీజేపీ నేత ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నోటీసు వచ్చిన వ్యక్తులు ప్రగతిభవన్​కు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.

BJP leader NVSS Prabhakar
బీజేపీ నేత ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​

By

Published : Dec 19, 2022, 3:25 PM IST

Updated : Dec 19, 2022, 5:03 PM IST

BJP leader NVSS Prabhakar criticized TRS: అక్రమాల కేసులో నోటీసులు అందుకున్న వ్యక్తులు, పన్ను ఎగవేతదారులు ప్రగతిభవన్​కు ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే రోహిత్​రెడ్డిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ ప్రశ్నించారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రగతిభవన్​లోనే ఎమ్మెల్యేలకు ఎరపై స్కిఫ్టు తయారు చేశారని ఆరోపించారు. పన్నులు ఎగ్గొట్టిన వారికి ప్రగతిభవన్​ రక్షణగా మారిందని విమర్శించారు.

ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొనే వారికి ప్రగతిభవన్​లో ముందు రక్షణ కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ తెలిపారు. హైకోర్టు జోక్యం చేసుకొని ప్రగతిభవన్​ను వెంటనే సీజ్​ చేయాలని కోరుతున్నట్లు వివరించారు. కేసీఆర్​ను వ్యతిరేకించే వారు.. మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చని ప్రకటించారు. 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఆ పార్టీ కనీసం ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు.

"నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన స్కిప్టు, స్కీన్​ప్లే, దర్శకత్వం, విడుదల చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్​. ఎక్కడ నుంచి ప్రగతిభవన్​ నుంచి.. అసలు ప్రగతిభవన్​ ఎవరి కోసం ఉంది ప్రజల పరిపాలన కోసమా లేక సీఎం అధికారిక కార్యక్రమాలను సమీక్షించడం కోసమా.. లేక అక్రమాలు చేసే వారికి, ఆరాచకాలు చేసే వారికి, నోటీసులు ఇచ్చే వారికి, పన్ను ఎగవేతదారులకు సలహా కేంద్రంగా, రక్షణ కేంద్రంగా ఉందని బీజేపీ తెలియజేస్తుంది." - ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​, మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్​ను వ్యతిరేకించే వారు.. మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చు

ఇవీ చదవండి:

Last Updated : Dec 19, 2022, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details