తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాప్రా భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి'

హైదరాబాద్ కాప్రా భూఅక్రమాలపై వెంటనే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని భాజపా నేత ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెరాసకు చెందిన కిందస్థాయి నాయకుల నుంచి పైస్థాయి వరకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

By

Published : May 25, 2021, 5:14 PM IST

nvss prabhakar, bjp leader nvss prabhakar
ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్, భాజపా నేత ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్

హైదరాబాద్‌ కాప్రా భూ అక్రమాలపై వెంటనే సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని భాజపా నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని తెరాస పార్టీకి చెందిన కింది స్థాయి నాయకుల నుంచి పైస్థాయి వరకు భూఅక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెరాస పాలన అవినీతి మయంగా మారిందని ప్రభాకర్‌ విమర్శించారు.

ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి, తహశీల్దార్ గౌతమ్‌ కుమార్‌లపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. కాప్రా భూ అక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువుల ప్రమేయం కారణంగానే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడమే తెరాస నేతల సిద్దాంతమని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయలకు అతీతంగా పాలన సాగించాలని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details