తెలంగాణలో తాలిబన్ల మద్దతుదారులు ఉన్నారని.. ఎంఐఎం పార్టీ తాలిబన్లకు మద్దతు ఇస్తోందని భాజపా నేత మురళీధరరావు ఆరోపించారు. తెలంగాణలో మార్పు కోసమే బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారని.. తెలిపారు. తెరాస నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దివాళా తీసిందని మండిపడ్డారు.
అవినీతికి మారుపేరుగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఒక కుటుంబం పాదాల వద్ద తాకట్టులో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు సొంత రాష్ట్రంలోనూ.. లాఠీల దెబ్బలు తప్పడం లేదని... తెరాస ప్రభుత్వాన్ని దించగలిగే సామర్థ్యం భాజపాకి మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణలో మిగిలిన పార్టీల డీఎన్ఏ అంతా ఒక్కటేనని ఆరోపించారు.
తెలంగాణ వచ్చాక ఉద్యోగ అవకాశాలు తగ్గి యువత తీవ్రంగా నష్టపోయిందని.. కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పదో తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ఏడేళ్లుగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పాదయాత్ర ప్రచార పోస్టర్, లోగోను విడుదల చేశారు.
రాష్ట్రంలో మార్పు కోసమే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అవినీతికి మారుపేరుగా కేసీఆర్ ప్రభుత్వం తయారైంది. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. అవినీతికి మారుపేరుగా కేసీఆర్ ప్రభుత్వం తయారైంది.