తెలంగాణ

telangana

ETV Bharat / state

మతోన్మాద ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆరే కారణం: మురళీధర్ రావు - muralidhar comments on mim party

Muralidhar Rao on TRS & MIM: ఎంఐఎంతో తెరాస కుమ్మక్కై హిందువులపై కేసులు పెడుతోందని భాజపా సీనియర్‌ నేత మురళీధర్‌రావు విమర్శించారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో బోధన్‌లో కర్ఫ్యూ విధించడంపై ఆయన మండిపడ్డారు.

muralidhar rao
మురళీధర్ రావు

By

Published : Mar 21, 2022, 4:23 PM IST

Muralidhar Rao on TRS & MIM: ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌ నుంచి ఇస్లామాబాద్ వరకు టెర్రర్‌ కారిడార్ చేస్తోందని భాజపా సీనియర్ నేత మురళీధర్‌రావు ఆరోపించారు. నిజామాబాద్, బైంసా నిర్మల్‌, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. బోధన్‌లో హిందువులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై మురళీధర్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హిందువుల ప్రాణాలు, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని మురళీధర్ డిమాండ్ చేశారు. మతోన్మాద ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. నిజామాబాద్,ఆదిలాబాద్​లో లవ్ జిహాద్‌ కేసుల్లో పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, ఎంఐఎం కలిసిపోయి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

"శివాజీ విగ్రహాన్ని స్థాపించకూడదు అని వ్యతిరేకత ప్రదర్శించడం.. భారత్ మాతకు, శివాజీకి జై అనడం నేరమా.? ముస్లిం మత ఉగ్రవాద రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తిగా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ ఫైల్స్ గురించి ఇంతవరకూ కేసీఆర్ మాట్లాడలేదు. తెరాస, ఎంఐఎం కుమ్మక్కై హిందువులపై కుట్రలు చేస్తున్నాయి." - మురళీధర్‌రావు, భాజపా సీనియర్‌ నేత

మతోన్మాద ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆరే కారణం: మురళీధర్ రావు

ఇదీ చదవండి:CM KCR in TRSLP Meeting: ''కశ్మీర్ ఫైల్స్‌'ను వదిలిపెట్టి.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details