తెలంగాణ

telangana

ETV Bharat / state

Tirupati Reddy Kidnapping Case : స్థిరాస్తి వ్యాపారి తిరుపతిరెడ్డి ఆచూకీ లభ్యం.. అసలేం జరిగింది? - Realtor Kidnapping

Mukkera Tirupati Reddy Kidnapping Case Update : ఉత్కంఠ రేకెత్తించిన బీజేపీ లీడర్‌, స్థిరాస్తి వ్యాపారి తిరుపతి రెడ్డి మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. తిరుపతి రెడ్డి విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత నెల 13వ తేదీన ఆయన అదృశ్యమయ్యాడు.

Tirupati Reddy Kidnapping
Tirupati Reddy Kidnapping

By

Published : Jul 18, 2023, 1:53 PM IST

BJP leader Mukkera Tirupati Reddy Kidnapping : రాష్ట్రంలో సంచలనంగా మారిన బీజేపీ లీడర్‌, స్థిరాస్తి వ్యాపారి ముక్కెర తిరుపతి రెడ్డి మిస్సింగ్ వ్యవహారంలో ఉత్కంఠ వీడింది. ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి విజయవాడలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆయన్ను తిరిగి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. అనేక పరిణామాలనంతరం తిరుపతి రెడ్డి ఆచూకి లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

కేసులో అనేక ట్విస్ట్‌లు:గత నెల 13వ తేదీ నుంచి తిరుపతి రెడ్డి కనిపించకుండా పోయారు. ఆయన భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిపై పోలీసులు మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. స్థిరాస్తి వ్యాపారి తిరుపతిరెడ్డిని ఎవరైనా అపహరించారా, లేక ఇతర కోణాలేమైనా ఉన్నాయా, కిడ్నాప్‌ డ్రామా ఆడాడా అనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. మొత్తంగా అతని ఆచూకీ లభించడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.

Real estate dealer Tirupati Reddy Kidnap Case : ఈ కేసును విచారించిన పోలీసులు ముందుగా సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో తిరుపతిరెడ్డి గురువారం అల్వాల్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కారు దిగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఆటోలో ప్రయాణించారు. ఆటో నెంబర్‌ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి పలు వివరాలు రాబట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆటో ఎక్కగా రూ.700 తీసుకొని ఘట్‌కేసర్‌లో దింపినట్టు డ్రైవర్‌.. పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత ఆయన ఆచూకీ తెలియ లేదు. తిరుపతి రెడ్డిని ఎవరైనా అపహరించారా! తానే వెళ్లాడా! అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

భూవివాదమే కారణమా: ఓల్డ్‌ అల్వాల్‌లోని 566, 568ఆ, 571 సర్వేనంబర్ల పరిధిలో తిరుపతి రెడ్డికి కోట్లు విలువ చేసే స్థలాలు ఉన్నాయి. ఎకరంన్నర స్థలం పంపకాల్లో తిరుపతిరెడ్డికి మామిడి జనార్దన్‌రెడ్డితో గత కొంత కాలంగా గొడన నడుస్తోంది. భూ వివాదంలో స్థానిక పోలీసులు జనార్దన్‌ రెడ్డికి కొమ్ము కాస్తున్నారని తిరుపతి రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక ప్రజాప్రతినిధి అండదండలతోనే తన స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతి రెడ్డి అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీ నేతల పనే: స్థల వివాదంలో అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నేతలే తిరుపతి రెడ్డి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఆచూకీతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరుపతి రెడ్డిని కిడ్నాప్ చేశారా.. అతని మిస్సింగ్ వెనక వేరే కారణాలున్నాయా... అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details