తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ పాలనలో ఎస్సీల అణచివేత : మోత్కుపల్లి

ఎస్సీల వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని భాజపా సీనియర్​ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రికి ఎస్సీలపై చిత్తుశుద్ధి ఉంటే ధర్మారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు.

కేసీఆర్​ పాలనలో ఎస్సీలు అణచివేయబడుతున్నారు: మోత్కుపల్లి
కేసీఆర్​ పాలనలో ఎస్సీలు అణచివేయబడుతున్నారు: మోత్కుపల్లి

By

Published : Feb 2, 2021, 4:54 PM IST

కేసీఆర్ నియంత పాలనలో ఎస్సీలు అనేక రకాలుగా అణచివేతకు గురవుతున్నారని మాజీమంత్రి, భాజపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటే తెరాసను ప్రజలు గెలిపించారని... లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను అవమానించే పరిస్థితి కేసీఆర్ పాలనలో చోటుచేసుకుందన్నారు. ఐదేళ్లు మాల, మాదిగలకు మంత్రి వర్గంలో కేసీఆర్ చోటు కల్పించలేదని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఎస్సీల వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించి.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి ధర్మారెడ్డిని భర్తరఫ్ చేయాలని... లేని పక్షంలో భాజపా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించాడని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details