తెలంగాణ

telangana

ETV Bharat / state

మన వ్యాక్సిన్​​ కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపు: లక్ష్మణ్ - ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవం

హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవాన్ని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు గాలిపటాలను కార్పొరేటర్ పావని వినయ్ కుమార్​తో కలిసి పంపిణీ చేశారు.

మన వ్యాక్సిన్​​ కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపు: లక్ష్మణ్
మన వ్యాక్సిన్​​ కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపు: లక్ష్మణ్

By

Published : Jan 14, 2021, 3:14 PM IST

Updated : Jan 14, 2021, 8:37 PM IST

కరోనా నిర్మూలనకు తయారు చేసిన వ్యాక్సిన్​తో సమాజంలో పూర్వ పరిస్థితులు ఏర్పడనున్నాయని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు గాలిపటాలను కార్పొరేటర్ పావని వినయ్ కుమార్​తో కలిసి పంపిణీ చేశారు.

రేపటి నుంచి ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని లక్ష్మణ్ వివరించారు. భారతదేశ వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోందన్నారు.

ఇదీ చూడండి:పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Last Updated : Jan 14, 2021, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details